RR vs CSK: నరాలు తెగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ..! 3 d ago

featured-image

IPL 2025లో భాగంగా గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. చివరి ఓవర్ వరకు వచ్చిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు చెన్నై పై 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌కి 20 పరుగులే కావాల్సిన.. ఓ పక్క ధోని క్రీజులో ఉన్న మ్యాచ్‌కి విజయాన్ని అందించలేక పోయాడు. దీంతో CSK వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీతో RR తొలి విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. 


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్ లోనే జైస్వాల్ (4) అవుట్ అవ్వడంతో.. CSK దే మ్యాచ్ అనుకున్నారు. కానీ, ఊహించని రీతిలో నితీశ్ రాణా తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టి 81 పరుగులు చేసాడు. ఒక పక్క సంజు శాంసన్ (20) సాధనంగా ఆడుతున్న.. నితీశ్ రాణా ఏమాత్రం ఆగలేదు. వస్తున్న ప్రతి CSK బౌలర్ ని వీర బాదుడు బాదాడు.


సంజూ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (37) దూకుడుగా ఆడాడు. ఒక దశలో నితీశ్ రాణా హిట్టింగ్ కు 200 పైగా స్కోర్ నమోదవుతుందనుకున్న సమయంలో.. CSK బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. వెంట వెంటనే బ్యాటర్లు పడిపోయారు. షిమ్రాన్ హెట్మైర్ (19) కూడా అంతగా రాణించలేదు.


RR బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 రన్స్‌కి పరిమితమైంది. CSK తరుపున ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీశ పథిరాన రెండేసి వికెట్ల చొప్పున తీయ‌గా… జడేజా, అశ్విన్‌కు ఒక్కో వికెట్ దక్కింది.


అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు కావాల్సిన పరుగులు రాబ‌ట్టలేక పోయారు. మొదటి ఓవర్ లోనే రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (23), కెప్టెన్ గైక్వాడ్ భాగస్వామ్యంతో CSK కి పవర్ ప్లే లో చెప్పుకోతగ్గ పరుగులు వచ్చాయి. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వెయ్యడంతో.. CSK బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. గైక్వాడ్ (63) ఒక్కడే తడబ‌డకుండా RR బౌలర్లను ఎదురుకున్నాడు.


16వ ఓవర్‌లో గైక్వాడ్ అవుటైన తర్వాత ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ధోని వచ్చే సమయానికి మ్యాచ్ గెలవాలంటే CSK కు 25 బంతుల్లో 54 పరుగులు కావాల్సి ఉంది. అప్పటికే క్రిజూలో ఉన్న ధోని, జడేజాలు మ్యాచ్‌ని ముగించేస్తారని అభిమానులు ఆశించారు. మొదట్లో మెల్లగా ఆడిన ధోని 19వ ఓవర్ హిట్టింగ్ మొదలు పెట్టాడు. దీంతో చివరి ఓవర్ కి 20 పరుగులు కావాల్సి వచ్చింది.


20వ ఓవర్ ఫస్ట్ బాల్ వైడ్ కావడంతో… ఇంకా విజయానికి 19 పరుగులే కావాల్సొచ్చింది. ఇక మ్యాచ్ CSK దే అనుకున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. లో ఫుల్‌టాస్ బంతిని గాల్లోకి లేపి ధోని బౌండరీ వద్ద దొరికిపోయాడు. 11 బంతులు ఆడిన ధోనీ 16 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. చివరి వరకు జడేజా (32) ఉన్న మ్యాచ్ ని గెలిపించలేక పోయాడు. దీంతో CSK 6 వికెట్ల నష్టానికి కేవలం 176 పరుగులు మాత్రమే చేసింది.


చివరి ఓవర్ వరకు టెన్షన్ పెట్టిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించి.. విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించిన చెన్నై.. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఓటమితో చెన్నై 7వ స్థానానికి పడిపోయింది. 


టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో MI తమ మొదటి విజయం కోసం పోరాడుతుంది, అదే సమయంలో KKR తమ గెలుపు ర్యాంబోను కొనసాగించాలనుకుంటుంది. 


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD